బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు

బాదం లాంటి నట్స్‌లో 15 రకాల పోషకాలైన విటమిన్ ఈ, మెగ్నీషియం, రిబోఫ్లోవిన్, జింక్ మొదలైనవి ఉంటాయి. వీటితో పాటుగా బాదాం ల లో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. రోజువారీ ఆరోగ్యం కోసం డైట్‌లో బాదంను తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

అంతర్జాతీయంగా మరియు భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మరణాలకు అతిపెద్ద కారణంగా కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ నిలుస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం హెల్తీ డైట్‌లో భాగంగా బాదములను తినడం వల్ల డిస్లిపిడెమియా తగ్గుతుంది.

భారతదేశంతో పాటుగా అంతర్జాతీయంగా ఉబకాయం అనేది అతి తీవ్రమైన వైద్య స్థితిగా మారుతుంది. ఓ గుప్పెడు బాదములలో ఆకలి తీర్చే లక్షణాలు వున్నాయి కాబట్టి కడుపు నిండిందన్న భావన కలిగించడం వాళ్ళు తక్కువ ఆహరం తీసుకోవడం ద్వారా ఉబకాయం తగ్గించుకోవడాని బాదం బాగా ఉపయోగపడుతుంది.

చర్మ ఆరోగ్యంపై ఎన్నో అంశాలు ప్రభావం చూపుతుంటాయి. ఆరోగ్యవంతమైన చర్మం కోసం పౌషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చర్మం ప్రకాశవంతంగా మారడంలో బాదం తోడ్పడుతుంది.