కుంభం(20 – 26 మే 2019)

ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి.

ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యానికి హాజరవుతారు. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు శ్రమ అధికం. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగుకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.