కుంభం(6 – 12 మే 2019)

ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. అనుకూల పరిస్థితులున్నాయి. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం సాయం తగదు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆహ్వానం అందుకుంటారు.

బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. పరిచయాలు బలపడతాయి. సేవ, దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతిలోపం. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం.