మేషం(22 – 28 ఏప్రిల్ 2019)

అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం అంచనాలు ఫలించవు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. చేతిలో ధనం నిలవదు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మొండిగా వ్యవహరిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల దర్శనం వీలుకాదు.

సంతానంపై చదువులపై దృష్టి పెడతారు. బుధవారం నాడు హడావుడిగా సాగుతాయి. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన మంచిది. వాహనం, గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అనవసర జోక్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో జాగ్రత్త. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం విరమించుకుంటారు.