మేషం(6 – 12 మే 2019)

అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టి పెడతారు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. సామరస్యంగా మెలగాలి.

దంపతుల మధ్య దాపరికం తగదు. ఆహ్వానాలు అందుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధత్యల్లో మెళకువ వహించండి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. తేదీలలో జయం పొందుతారు.