ఏప్రిల్ 2020 రాశి ఫలాలు

మేష రాశి: ఈ మాసంలో ధనాదాయం కొంత వరకు తగ్గును. ఉద్యోగ జీవనంలో స్థానచలనం ఏర్పడును. విదేశీ సంబంధ నివాస ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. వాహనాల వలన ధనవ్యయం అధికంగా ఏర్పడును. ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక చికాకులు బాధించు సూచన. విద్యార్ధులు శ్రమించ వలెను. వ్యాపార వర్గం వారు 14 తేదీ తదుపరి లాభాపడుదురు. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి స్థిరమైన ఆలోచనా విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడును. కుటుంబ సభ్యుల సహాయం అవసరమగు సంఘటనలు. ఈ మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనవి కావు.

వృషభ రాశి: ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అపరిష్కృతంగా ఉన్న తగాదాలు పరిష్కారమగును. ధనాదాయం ఆశించినంత ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అగును. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా వాహన సంబంధ వ్యాపారాలు చేయువారికి బాగా కలసి వచ్చును. ఈ మాసంలో 9 వ తేదీ నుండి 17 వ తేదీ మధ్య కొద్దిపాటి వృధా ధన వ్యయం మరియూ అనారోగ్య సూచన. 19, 20, 21 తేదీలు వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలం. 27 నుండి మాసాంతం వరకూ ఉద్యోగ జీవనంలో శ్రమ అధికమగును. ఒత్తిడులు ఎదుర్కొందురు.

మిథున రాశి: ఈ మాసంలో కార్య నిర్వహణలో అందరికన్నా ముందు ఉండి ప్రతిభతో ఉన్నత అధికారులను ఆకర్షించగలరు. వాయిదా పడుతున్న పనులు పూర్తీ అగును. జీవిత భాగస్వామి వలన ధన ప్రాప్తి లేదా స్థిరాస్తి లాభం ఏర్పడును. నూతన వస్త్ర యోగం ఉన్నది. తలపెట్టిన పనులు ఆశించిన విధంగా పూర్తీ అగును. అన్ని రంగాల వారికి ఈ మాసం కొంత ఆశాజనకంగానే ఉండును. పట్టుదల వదిలి ఆలోచించడం మంచిది. వ్యాపార రంగం వారు ఆశించిన ధనాదాయం పొందుదురు. విద్యార్ధులకు ఉన్నత విద్యా అవకాశములు లభించును.

కర్కాటక రాశి: ఈ మాసంలో ధన సంబంధ విషయాలు ప్రతికూలం. ఉద్యోగ జీవనములో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడు సూచన. ఆరోగ్య పరంగా ముత్ర సంబంధ సమస్యలు, శిరోబాధ బాధించు సూచన. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం తగ్గును. చేపట్టిన పనులు , నూతన ఆరంభములు ప్రతిఘటనలతో కొనసాగును. ఇతరుల సహాయ సహకారాలకోసం కష్టపడుదురు. ఈ మాసంలో సహనంతో వ్యవహరించుట అన్ని విధాల మంచిది. ఈ మాసంలో 16, 20, 23, 29 తేదీలలో ఆర్ధిక – ఆరోగ్య విషయాలందు జాగ్రత్తగా ఉండుట మంచిది.

సింహ రాశి: ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగును. నూతన వాహన సౌఖ్యం ఏర్పడును. సంతాన ప్రయత్నాలు ఈ మాసంలో విజయవంతం అగును. ఉద్యోగ జీవులకు సాధారణ ఫలితాలు. సమయానుకూలత చూసుకొని ఉన్నత అధికారులతో సంప్రదింపులు చేయవచ్చు. మిత్ర వర్గం సలహాల వలన మేలు జరుగుతుంది. శ్రమ తగ్గుతుంది. ఆర్ధిక వ్యయం అదుపులోకి తెచ్చుకొంటారు. 17, 18, 19, 20 తేదీలలో ఒక అశుభ వార్త వినడానికి సూచనలు కలవు. 23 వ తేదీ తదుపరి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలకు అనువైన కాలం. మహిళలకు ఆరోగ్యం సహకరిస్తుంది.

కన్యా రాశి: ఈ మాసంలో ఆరోగ్య మందగమనం ఆందోళన కలిగించును. తృతీయ వారం నుండి ఆహార అలవాట్లు , వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవన విధానంలో మార్పులు ఏర్పడును. కుటుంబ వ్యవహారాలు చికాకులు కలిగించును. కుటుంబ సభ్యులు మీ సలహాలు పాటించరు. నూతన గృహ నిర్మాణ విషయాలలో ఇబ్బందులు పరిష్కారం అగును. నూతన ఉద్యోగ అవకాశములు లభించును. స్థిరచిత్తంతో పనిచేయుదురు. కీర్తి లభిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకొంటారు. 22, 23, 24 తేదీలలో వృధా వ్యయం.

తులా రాశి: ఈ మాసంలో ప్రధమ వారంలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. నూతన ప్రయత్నాలు తప్పక విజయవంతం అగును. వ్యాపార విస్తరణకు మిత్రులు కలిసి వస్తారు. మూలధనం సమకుర్చూకొగలరు. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకర సమయం ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. 17, 18, 19 తేదీలలో గతకాలపు ఋణ బాధలు తొలగును. నూతన లక్ష్యాలను నిర్దేసించుకుంటారు. చివరి వారంలో సామజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ మాసంలో శుభ ఫలితాలు ఏర్పడును. వ్యక్తిగత జీవనంలో మానసిక సంతోషం, తృప్తి లభించును

వృశ్చిక రాశి: ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జాతకులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింతగా ఇబ్బంది కలిగించును. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం ఉండదు. జీవిత భాగస్వామి సంబంధిత బంధు వర్గం వారితో విరోధములు ప్రారంభం అగును. గృహ సంబంధ స్థాన చలన ప్రయత్నాలు ద్వితీయ వారంలో ఫలించును. అనురాధా జన్మ నక్షత్ర జాతకులు మానసిక చాంచల్యత వలన చక్కటి అవకాశములను కోల్పోవుదురు. ఈ మాసంలో 18, 19 తేదీలలో వాహన ప్రమాద సూచన ఉన్నది. 22 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో జయం ఏర్పడును. కార్యాలయంలో కోరుకున్న సౌకర్యములు లభించును.చివరి వారంలో అన్నివిధములా పరిస్థితులు అనుకూలంగా ఉండును.

ధనుస్సు రాశి: ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామి మూలాన స్థిరాస్తి లేదా సువర్ణ లాభం. ఊహించని విధంగా ఒక తగాదా వలన చికాకులు. వృత్తి వ్యాపారముల వలన సామాన్య ధన సంపాదన. గృహంలో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణాపూర్వక వాతావరణం. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఒత్తిడి , శ్రమ అధికం. మాసాంతంలో వ్యసనాల వలన వృధా వ్యయం. నిర్లక్ష్యం వలన కార్యవిఘ్నత. ప్రభుత్వ వ్యవహారములలో అననుకూలత. ఈ మాసంలో 3, 6, 16, 23 , 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు.

మకర రాశి: ఈ మాసంలో పితృ వర్గానికి చెందిన ఆత్మీయులకు సంబంధించిన ఒక అశుభ వార్త వినడానికి సూచనలు ఉన్నాయి. ధన ఆదాయం అవసరాలకు తగిన విధంగా ఉండును. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఆశించిన ఫలితాలు ఏర్పడును. కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగును. సమాజంలో నూతన హోదా ను ఏర్పాటుచేయుదురు. జీవిత భాగస్వామి నుండి సంతాన విషయాలలో తోడ్పాటు లభించును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఆశించిన రీతిలో అనుకూలంగా కొనసాగును. చివరి వారంలో చక్కటి మానసిక ప్రశాంతత లభించును. ఈ మాసంలో 24, 25, 26 తేదీలలో యుక్త వయస్కులైన పుత్ర సంతానానికి ఆరోగ్య సమస్యలు.

కుంభ రాశి: ఈ మాసంలో పరిస్థితులు క్రమంగా మెరుగవును. ధనాదాయం క్రమంగా పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో ప్రోత్సాహం లభించును. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు ఏర్పడును. పై అధికారుల వలన లాభం ఉంటుంది. స్త్రీలకు కీళ్ళ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలుగ చేయును. ఈ మాసం భాగస్వామ్య వ్యాపార విస్తరణకు మంచి సమయం. కుటుంబ విషయ సంబంధ ప్రయాణాలు ఏర్పడతాయి మరియు లాభకరంగా పూర్తి అగును. చివరి వారంలో వివాహ సంబంధ అనుకూలత ఉన్నది. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వర్తిస్తారు.

మీన రాశి: ఈ మాసంలో ప్రధమ వారంలో మిత్రులతోనూ , అధికారులతోనూ విభేదములు ఏర్పడును. ద్వితియ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం కొంత తగ్గును. తృతీయ వారంలో సంతానం వలన సౌఖ్యత ఏర్పడును. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉన్నాయి. క్రీడా రంగంలోని వారికి చక్కటి విజయములు లభించును. 20 వ తేదీ తదుపరి ఆర్ధిక పరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమగు సూచనలు ఉన్నాయి.