మే 2020 రాశి ఫలాలు

మేష రాశి: ఈ మాసం కళారంగం లోని వారికి, మీడియా రంగంలో పనిచేయు వారికి చక్కటి ఫలితాలు కలుగచేయును. ఆర్ధికంగా లాభించును. వివాహ ప్రయత్నాలు సులువుగా విజయం పొందును. వైవాహిక జీవనంలో సంతోషకరమైన సంఘటనలు ఏర్పడును. పుణ్యక్షేత్ర సందర్శన సూచనలు కలవు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వారసత్వ సంబంధ సమస్యలు తగ్గుముఖం పట్టును. 12 నుండి 19 వ తేదీ మధ్య కాలం ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు లేదా ఆకస్మిక ఉద్యోగ నష్టం. 20వ తేదీ తదుపరి చేపట్టిన పనులు నిదానంగా పూర్తీ అగును. తీసుకొనే నిర్ణయాలలో ఆవేశ పడకుండా ఉండటం అవసరం. ఈ మాసంలో కాలి నరములకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలోని వారికి సగటు ఆదాయం తగ్గును.

వృషభ రాశి: ఈ మాసం ప్రధమ అర్ధ భాగంలో వైవాహిక జీవనంలో పట్టుదల, ఉద్రిక్తతలు ఎదుర్కొందురు. భూ సంబంధ కొనుగోలు ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు విఫలమగును. ఉన్నత అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. గత మాసపు ఉద్యోగ జీవన ఒడిదుడుకులు తొలగును. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉండును. నిరుద్యోగులు మరింత దీక్షా , పట్టుదలను ప్రదర్శించాలి. చివరి వారంలో ఆత్మీయులతో ఉన్న వివాదాలు సర్దుబాటు చేసుకొందురు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను కష్టం మీద చివరి నిమిషానికి పూర్తీ చేయగలుగుతారు. స్నేహితులు సహకారం లభించును. రాజకీయ రంగంలోని వారికి ఊహించని అవకాశములు లభించును. ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు లాభించును.

మిథున రాశి: ఈ మాసంలో నూతన ఆలోచనలు ఎలాంటి ప్రతి ఘటనలు లేకుండా అమలు చేయగలరు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా నడుచును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. బాగా తెలిసిన వ్యక్తుల వలన చక్కటి సంబంధాలు కుదురును. ఉద్యోగులకు దూర ప్రాంత ధనాదాయం ప్రాప్తించును. స్పెక్యులేషన్ లాభించును. పని చేయు కార్యాలయంలో కపట స్వభావులు ఎదురగుదురు. కుటుంబ సమస్యల తీర్పులలో నిర్ణయాత్మకంగా ప్రధాన పాత్ర వహిస్తారు. నూతన ఒప్పందాలు లభిస్తాయి. స్థాన చలన అవకాశములు లేవు. మిత్ర వర్గంలో గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈ మాసంలో 17, 18 తేదీలు మినహా మిగిలిన రోజులు అనుకూలంగానే ఉండును.

కర్కాటక రాశి: ఈ మాసంలో ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గును. నూతన వ్యవహారాలు, వివాహ సంబంధ ప్రయత్నాలు మాత్రం సమస్యలు కలిగించును. జీవిత భాగస్వామి బంధువులతో శతృత్వం. వ్యక్త్రిగత జీవనంలో కొద్దిపాటి సమస్యలు. కుటుంబ బంధాలపై నమ్మకం దెబ్బతినును. చేపట్టిన పనులను మధ్యలోనే వడిచిపెట్టుదురు. వ్యతిరేక ఫలితాల వలన ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. కుల వృత్తులపై ఆధార పడిన వారికి తీవ్ర సమస్యలు. ఋణ బాధలు. తృతియ , చతుర్ధ వారములలో సంతన సంబంధ శుభ వార్త. మొత్తం మీద ఈ మాసం ఈ మాసం అంత అనుకూలమైనది కాదు.

సింహ రాశి: ఈ మాసంలో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు , నూతన ఉద్యోగ జీవన ప్రయత్నాలు విజయవంతం అగును. గృహంలో హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించదేరు. కుటుంబానికి పూర్వ వైభవం తెస్తారు. కుటుంబానికి ధనధాన్య లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో శని గ్రహం బలంగా ఉన్నవారికి రాజకీయ రంగ ప్రవేశానికి ఈ మాసం అనువైన కాలం. అధికారుల ఒత్తిడి తగ్గును. 8 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఒక ఆపద నుండి బయటపడతారు. శత్రుత్వాలు తొలగి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. నిత్య జీవన విధానంలో ఆశించిన మార్పులు చేసుకోగలరు. నూతన ఆరోగ్య పద్దతులు అలవాటు చేసుకొంటారు. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం ఆశించినంతగా ఉండును.

కన్యా రాశి: ఈ మాసంలో కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగించును. ధనదయం సామాన్యం. ప్రధమ వారంలో విమర్శలు ఎదుర్కొందురు. శుభకార్య సంబంధ విషయాల వలన వ్యయం అంచనాలను మించుతుంది. ఖర్చుపై నియంత్రణ అవసరం. వ్యాపార వర్గం వారు ఆకస్మిక ధననష్టం కలుగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు విజయవంతం అగును. లక్ష్యాలను చక్కగా పూర్తీ చేయగలరు. సంతానానికి ఉత్తమ జీవితం లభిస్తుంది. స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయి. సోదర వర్గం వలన లాభం. కళత్ర విషయాలు కొంత ప్రతికూలత ఎదుర్కొనును.

తులా రాశి: ఈ మాసంలో ఆశించిన విధంగా నూతన జీవన విధానాలు ప్రారంభం అవుతాయి. ధనాదాయం సామాన్యం. ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లేదా వేతన పెరుగుదల లభిస్తుంది. విద్యార్ధులకు చక్కటి సంకేతిక విద్యలో ప్రవేశం లభించును. 9, 10, 11, 12 తేదీలలో వివాహ సంబంధ లేదా సంతాన సంబంధ శుభవార్తలు వింటారు. పరోపకారం వలన ఇతరుల మన్ననలు పొందుతారు. వృత్తి జీవనంలో కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుచును. వినోద కార్యక్రమాలకై ధనం ఖర్చు అగును.

వృశ్చిక రాశి: ఈ మాసంలో అన్నివిధాలా ఆదాయం బాగుండును. వ్యాపార విస్తరణకు, నూతన ఆలోచనలు అమలుచేయుటకు ఈ మాసం కలసి వచ్చును. విదేశీ ప్రయత్నములు చేయుటకు, వివాహ ప్రయత్నములు – సంతాన ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం. ఈ మాసంలో 3 వ తేదీ నుండి 15 వ తేదీ మధ్య కాలంలో ఆకస్మిక ప్రయాణములు ఏర్పడును. సోదర సోదరి వర్గీయులకు సంబందించిన ఇబ్బందుల వలన మానసిక చికాకులు. 19,20,21 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారములలో గౌరవ నష్టం. అపవాదులు బాధించును. చివరి వారంలో శారీరక శ్రమ అధికం అగును. నరముల సంబంధిత సమస్యలు ఇబ్బంది కలిగించును. తల్లితండ్రులతో కుటుంబ బాధ్యతలకై తగాదాలు.

ధనుస్సు రాశి: ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. మీ ప్రమేయం లేకుండా అవమానములు, అపవాదులు భరించవలసి వచ్చును. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా ఆసక్తి కలిగివున్న వారికి ఆశించిన పదవులు, ఉన్నత హోదా పొందుటకు ఇది అనువైన కాలం. విదేశీ సంబంధ స్థిర నివాసం కొరకు చేయు ప్రయత్నాలు ద్వితీయ వారంలో ఫలించును. తృతీయ వారంలో నిద్రలేమి సంబంధిత ఆరోగ్య సమస్యల వలన సమస్యలు. మాసాంతంలో ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉండును. గృహ సంబంధ స్థానచలనం ఏర్పడును. ఈ మాసంలో 8 , 10 , 14, 17 తేదీలు అనుకూలమైనవి కావు.

మకర రాశి: ఈ మాసంలో వివాహ జీవనంలో ఎదుర్కొంటున్న గత కాలపు సమస్యలు తగ్గును. వ్యక్తిగత జీవన పరిస్థితులు కూడా మెరుగుపడును. కోర్టు తగాదలలో అనుకూలత ఏర్పడును. గృహంలో బంధు వర్గం కలయికల వలన సంబంధాలు మెరుగుపడును. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్ధికంగా వ్యయం ఎక్కువ అగుటకు సూచనలు ఉన్నాయి. 22 వ తేదీ తదుపరి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సంతోషకర వార్తలు వింటారు. వ్యాపార వర్గం వారికి ఆదాయంలో పెరుగుదల ఏర్పడును. సంతాన ప్రయత్నాలు సఫలమగుటకు దైవ ఆశీస్సులు అవసరం.

కుంభ రాశి: ఈ మాసంలో కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్య సమస్యల వలన ఒత్తిడి ఎదుర్కుంటారు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. అవసరములకు రావలసిన ధనం చేతికి వచ్చును. 12 వ తేదీ నుండి 18 వ తేదీ మధ్య కాలంలో ప్రయనాలందు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో వాహన ప్రమాద సూచన ఉన్నది. తృతీయ వారం సామాన్య ఫలితాలను కలుగ చేయును. చివరి వారంలో అధిక ధన వ్యయం మరియు సొంత ఆరోగ్య విషయాలలో చికాకులను కలుగచేయును. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశాభంగములు ఎదుర్కొంటారు. చివరి నిమిషంలో అవకాశములు కోల్పోతారు. 24, 25, 26 తేదీలలో ఉద్రేక సంభాషణల వలన ఒక నష్టం ఎదుర్కొందురు. ఉపయోగించు పదాల పట్ల జాగ్రత్త అవసరం.

మీన రాశి: ఈ మాసంలో జీవనంలో గౌరవ హోదాలు పెరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభించును. ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు. కుటుంబ సంతోషములు ఉన్నాయి. ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు. అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు. ద్వితీయ వారం తదుపరి నూతన వ్యాపారములు ప్రారంభించుటకు అనుకూలత లభించును. మాసాంతంలో సంతాన భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడు సూచన.