మీనం(7-13 జనవరి 2019)

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఆర్థిక విషయాలపై దృష్టిసారిస్తారు. ఒక అవకాశం మీకు అనుకోకుండా కలిసివస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. ఖర్చులు మీ రాబడికి తగినట్టుగానే ఉంటాయి. రుణ, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. దూరపు బంధువుల ఆకస్మిక రాక అనుమానం రేకెత్తిస్తుంది. ఆది, సోమవారాల్లో కొన్ని విషయాల్లో మీపై సెంటిమెంట్లు, శకునాల ప్రభావం అధికంగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్యంలోను, షాపింగ్‌లోను తగు జాగ్రత్తలు అవసరం. ఎదుటివారి మాటలను తేలికగా తీసుకోవడం మంచిది కాదు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులు సమావేశాలు, విందుల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఏ యత్నం కలిసిరాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరుత్సాహం అధికమవుతుంది. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు వృత్తిపరంగాను, ఇతరత్రా చికాకులు తప్పవు. ప్రముఖ కంపెనీల షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు.