వృశ్చికం(20 – 26 మే 2019)

విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఖర్చులు విపరీతం.

ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించడి. అనవసర జోక్యం తగదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. విద్యాప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఊహించని ఫలితాలెదురవుతాయి. వాహనం ఇతరులకివ్వొద్దు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.