కర్కాటకం(20 – 26 మే 2019)

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో రాణిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. లైసెన్సుల, పర్మిట్ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు.

గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, వైద్య, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.