మకరం(20 – 26 మే 2019)

ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల్లో అవాంతరాలెదురవుతాయి. గురు, శుక్రవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి.

పరిచయం లేని వారితో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. పెద్దల సలహా పాటించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. బెట్టింగుల జోలికి వెళ్లొద్దు.