మకరం(6 – 12 మే 2019)

ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. మాట నిలబెట్టుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆత్మీయులు ఉల్లాసంగా గడుపుతారు. మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. అనుకూల ఫలితాలున్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు.

సోమ, మంగళవారాల్లో పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. పెట్టుబడులకు సమయం కాదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.