క్యారెట్‌ షర్బత్‌

కావల్సినవి:

  • క్యారెట్లుఐదు
  • పాలునాలుగు కప్పులు
  • పంచదారకప్పు
  • యాలకులపొడిఅరచెంచా
  • జీడిపప్పు పలుకులుకొన్ని (వేయించాలి).

తయారీ:

పాలు కాచి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్‌ను ముక్కలుగా తరిగి ఉడికించుకోవాలి. చల్లారాక అందులో పాలు, యాలకుల పొడి కలిపి మిక్సీలో వేయాలి. వచ్చిన మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకొని మళ్లీ పొయ్యి మీద పెట్టాలి. కొద్దిసేపయ్యాక పంచదార, జీడిపప్పు పలుకులు వేసి బాగా తిప్పాలి. పానీయం కాస్త చిక్కగా అయ్యాక దించేయాలి. ఈ షర్బత్‌ను ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా తీసుకొంటే రుచిగా ఉంటుంది.