చైనీస్‌ వెల్లుల్లి వంకాయ

కావలసినవి:

 • వంకాయలు: పావుకిలో
 • ఉప్పు: రుచికి సరిపడా
 • మిరియాలపొడి: టేబుల్‌స్పూను
 • వెల్లుల్లితురుము: టేబుల్‌స్పూను
 • అల్లంతురుము: టీస్పూను
 • బియ్యప్పిండి: 4 టేబుల్‌స్పూన్లు
 • కార్న్‌ఫ్లోర్‌: 4 టేబుల్‌స్పూన్లు
 • పచ్చిమిర్చి తురుము: టేబుల్‌స్పూను
 • సోయాసాస్‌: టేబుల్‌స్పూను
 • నూనె: వేయించడానికి సరిపడా
 • ఉల్లికాడల తురుము: కప్పు
 • పంచదార: 2 టీస్పూన్లు.

తయారుచేసే విధానం:
* వంకాయల్ని సన్నగా పొడవాటి ముక్కలుగా కోయాలి.
* బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, మిరియాలపొడి, సగం సోయాసాస్‌, తగినన్ని నీళ్లు పోసి కాస్త జారుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వంకాయముక్కలకు పట్టించి కాగిన నూనెలో వేయించి తీయాలి.
* బాణలిలో కొద్దిగా నూనె వేసి అల్లంతురుము, వెల్లుల్లితురుము, పచ్చిమిర్చి తురుము, ముప్పావు వంతు ఉల్లికాడల తురుము వేసి నిమిషం వేయించాలి. తరవాత అరకప్పు నీళ్లు, ఉప్పు, మిగిలిన సోయాసాస్‌, పంచదార వేసి మరిగించాలి. ఇప్పుడు వేయించి తీసిన వంకాయముక్కలు వేసి నీళ్లన్నీ ఆవిరైపోయేవరకూ పొడిపొడిగా అయ్యేవరకూ వేయించి తీయాలి.
* చివరగా కొద్దిగా ఉల్లికాడల తురుముతో అలంకరిస్తే సరి.