ఎండు మామిడి పచ్చడి తయారీ విధానం

  • మామిడికాయలు – ఏడెనిమిది
  • ఉప్పు – మూడు టేబుల్‌స్పూన్లు
  • పసుపు – రెండు చెంచాలు
  • మెంతులు – రెండుటేబుల్‌స్పూన్లు
  • వాము – రెండుటేబుల్‌స్పూన్లు
  • ఆవాలు – రెండుటేబుల్‌ స్పూన్లు
  • కారం – పావుకప్పు
  • ఇంగువ – అరచెంచా
  • ఆవనూనె – కప్పు
  • సోంపు-తగినంత.

తయారీ:

మామిడికాయల్ని చెక్కుతీసి పొడుగాటి ముక్కల్లా తరగాలి. వీటిల్లో పసుపూ, ఉప్పూ వేసి ­రబెట్టాలి. రెండ్రోజులకు వాటి నుంచి వూట వస్తుంది. అప్పుడు వూట నుంచి ముక్కల్ని బయటికి తీసి, చేత్తో పిండి కనీసం రెండ్రోజులు ఎండబెట్టాలి. ఈ ముక్కల్ని ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. తరవాత మెంతులూ, వామూ, ఆవాలూ, సోంపూ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ, కారం, కొద్దిగా ఉప్పు, చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుని బాగా కలిపి అందులో మామిడి ముక్కల్ని వేసేయాలి. అంతే.. నోరూరించే ఎండుమామిడి పచ్చడి తయార్‌.