బీట్‌రూట్‌ ప‌చ్చ‌డి

కావల్సినవి:

  • బీట్‌రూట్‌- ఒకటి
  • ఉప్పు- తగినంత
  • కారం- అరకప్పు
  • ఆవపిండి- పావుకప్పు
  • నిమ్మరసం- ఆరుచెంచాలు
  • పసుపూ, నూనె- కప్పు
  • ఆవాలు- అరచెంచా
  • ఎండుమిర్చి- రెండు.

తయారీ:

బీట్‌రూట్‌ని చిన్నముక్కలుగా తరిగి అందులో నిమ్మరసం కలిపి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ వేయించి పొయ్యి కట్టేయాలి. అందులోనే తగినంత ఉప్పూ, కారం, ఆవపిండీ వేసి నిమిషం అయ్యాక ఈ తాలింపునంతా బీట్‌రూట్‌ ముక్కలకు కలిపితే చాలు.