మిథునం(6 – 12 మే 2019)

మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు వ్యవహారాలో ప్రతికూలతలే అధికం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక వలన ఏమంత ఫలితం ఉండదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది.

పనులు మొండిగా పూర్తిచేస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వేడుకలకు హాజరవుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వైద్య, సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి. దైవకార్యంలో పాల్గొంటారు.