రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి చిట్కాలు

>> విటమిన్ A, C, E ఉండే పండ్లు బాగా తినాలి. పులుపు ఉండే పండ్లు తింటే, యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి. బ్రకోలీ, టమాటాలు, పుచ్చకాయ, కమలాలు, నిమ్మకాయలు, బత్తాయిలు, బొప్పాయి, ద్రాక్ష ఇవన్నీ బాగా తినాలి.

>> ఉదయం సాయంత్రం వేళ సూర్యుడి ఎండ తగిలేలా చేసుకోండి. అలాగే రోజు కనీసం 15 నిముషాలయిన నడవండి

>> మాంసం, చికెన్, గుడ్లు, జీడిపప్పు, బాదం వంటి వాటిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి, కాబట్టి ఇవి తరచు తింటూవుండాలి.

>> ఎక్కువగా టెన్షన్ పడకండి. ఏ పనైనా అవుతుందిలే అని మనసులో గట్టిగా అనుకోండి. యోగా చెయ్యండి. కామెడీ సినిమాలు చూడండి. మీకు ఇష్టమైన పని చెయ్యండి. ఇష్టమైన వాళ్లతో మాట్లాడండి, ఒత్తిడి తగ్గించుకోండి.

>> సిగరెట్ మరియు మద్యం పూర్తిగా మానేయండి