శాఖాహారం ద్వారా ప్రోటీన్స్

మగవారికి రోజుకు 56 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. ఆడవాళ్ళకు 46 గ్రాములు కావాలి. చికెన్, మటన్ వంటివి తినేవారికి ప్రోటీన్స్ లోపం ఉండదు. కనీసం గుడ్లైనా తింటే ఈ లోపాన్ని కవర్ చేసుకోవచ్చు. ఇవేవీ తినడం ఇష్టం లేని వారు ప్రత్యేక ఆహారం తీసుకోవడం తప్పనిసరి.

శాఖాహారం ద్వారా ప్రోటీన్స్ పొందవచ్చు. వాటిలో కొన్ని…

రాజ్మా – వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. వీటిలో పొటాషియం, కాల్షియం, ప్రోటీన్స్ బాగా ఉంటాయి. రాజ్మా సూప్ లేదా కర్రీ తింటే చాలు… చాలా ఎనర్జీ వస్తుంది. 100 గ్రాముల రాజ్మాలో 9 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయి.

క్వినోవా – వీటిని సూపర్ ఫుడ్ అంటున్నారు. 100 గ్రాముల క్వినోవాలో 4.4 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. వేరుశనగ – వీటిలో ప్రోటీన్స్ బోలెడు ఉంటాయి. దాదాపు చికెన్‌తో సమానం. 10 గ్రాముల చికెన్‌లో 27 గ్రాముల ప్రోటీన్స్ వస్తాయి. అదే 100 గ్రాముల వేరుశనగలో… 26 గ్రాముల ప్రోటీన్స్ వస్తాయి.

ఓట్స్ – ఈమధ్య ప్రజలు ఓట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాటితో ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి. వాటిలో ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, థయామిన్, విటమిన్ B1 ఉంటాయి. 100 గ్రాముల ఓట్స్‌లో 16.9 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

పన్నీర్ – ఇది నచ్చని వారు ఇండియాలో తక్కువ మందే ఉంటారు. పన్నీరులో ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ B12, సెలెనియం, రైబోఫ్లావిన్ ఇతర పోషకాలుంటాయి. 100 గ్రాముల పన్నీరులో 14 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

బాదం పప్పుల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ బాగా ఉంటాయి. 100 గ్రాముల్లో 21.15 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అదే 100 గ్రాముల గుడ్లలో 11 గ్రాముల ప్రోటీన్సే ఉంటాయి.