సింహం(13 – 19 మే 2019)

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆర్థిక లావాదేవీలు చేపట్టిన పనులు ప్రశాంతంగా సాగుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు, ఇంటి అద్దెలు, రుణ బకాయిల వసూలులో సౌమ్యంగా మెలగండి. శనివారం నాడు ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు.

పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆస్తి పంపకాల వ్యవహారంలో పెద్దల నిర్ణయాన్ని శిరసా వహిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ మంచిది. వ్యవసాయదారులకు ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన చెందుతారు. వైద్య రంగాల వారికి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.