సింహం(20 – 26 మే 2019)

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. వ్యవహారాల్లో మీదే పైచేయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కష్టం ఫలిస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మీ అతిథ్యం అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. శనివారం నాడు పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.

సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. విద్యాప్రకటలను, దళారులను విశ్వసించవద్దు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం