తుల(13 – 19 మే 2019)

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూలత, గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ యత్నాలకు సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, పాత బకాయిలు వసూలు కాగలవు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. స్త్రీలకు మోకాళ్ల నొప్పులు, దంత బాధలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులు ఉన్నత, విదేశీ విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.

చేపట్టిన పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. మంగళ, బుధవారాల్లో ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్థాపం కలిగిస్తాయి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం మంచిది కాదు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. ఏజెంట్లు, బ్రోకర్లు, కాంట్రాక్టర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ఆస్తి వ్యవహారాలు, స్థల సరిహద్దు వివాదాలు పరిష్కారం కాగలవు. మీ వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త.