తుల(20 – 26 మే 2019)

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం అనుకూలదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారం కావు. ఆప్తులకు సాయం చేస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం.

ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆశ్చర్యకరమైన ఫలితాలెదురవుతాయి, సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ప్రయాణం చికాకుపరుస్తుంది.