మటన్‌ దాల్‌ ఘోస్ట్‌

కావలసినవి:

 • మసూర్‌దాల్‌: కప్పు
 • బోన్‌లెస్‌ మటన్‌: కిలో
 • ఉప్పు: రుచికి సరిపడా
 • నూనె: 4 టేబుల్‌స్పూన్లు
 • ఉల్లిపాయలు: రెండు
 • అల్లంముద్ద: టేబుల్‌స్పూను
 • వెల్లుల్లిముద్ద: 2 టేబుల్‌స్పూన్లు
 • జీలకర్రపొడి: టీస్పూను
 • పసుపు: అరటీస్పూను
 • గరంమసాలా: టీస్పూను
 • నిమ్మకాయ: ఒకటి
 • కొత్తిమీర తురుము: అలంకరణకు సరిపడా

తయారుచేసే విధానం:

* ప్రెషర్‌ కుక్కర్‌లో మటన్‌ముక్కలు, పప్పు, ఉప్పు, రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి మెత్తగా ఉడికించాలి.

* మరో పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయలు బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. అందులోనే అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్దలు వేసి ఓ నిమిషం వేయించాలి. అందులోనే దనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరంమసాలా వేసి నూనె తేలేవరకూ వేయించాలి. ఇందులో పప్పు-మటన్‌ ముక్కల మిశ్రమం వేసి కలిపి మరో పది నిమిషాలు సిమ్‌లో ఉడికించి దించాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి కలిపి కొత్తిమీరతో అలంకరిస్తే సరి.