మీనం(13 – 19 మే 2019)

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి గృహమార్పు, మరమ్మతులకు అనుకూలం. ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంకల్పబలంతో మీ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. బకాయిలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా వసూళ్లలో శ్రమాధిక్యత ప్రయాసలెదుర్కుంటారు. మీ శ్రీమతి ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏ పని చేయబుద్ధికాదు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి.

ప్రముఖ సంస్థల్లో భాగస్వామ్యం కోసం యత్నాలు సాగిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు మీరు చూసుకోవడమే మంచిది. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు, అధికారులు సాదర వీడ్కోలు పలుకుతారు. నూతన పెట్టుబడులు, లీజు, టెండర్లు, ప్రాజెక్టుల వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆత్మీయులు, చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.