మీనం(20 – 26 మే 2019)

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి సమర్థతను చాటుకుంటారు. కృషి ఫలిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతనవుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభాకార్యం నిశ్చయమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీరంటే గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.

వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. కొన్ని ఫలితాలు ఊహించినట్టే ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది.