బంగాళదుంప జంతికలు

కావల్సినవి:

బియ్యప్పిండి: మూడు కప్పులు, బంగాళదుంపలు- మూడు, ఉప్పు- సరిపడా, కారం – చెంచా, జీలకర్ర- చెంచా, నూనె- వేయించేందుకు సరిపడా.

తయారీ:

బంగాళదుంపల్ని ఉడికించి చెక్కు తీసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో బియ్యప్పిండీ, కారం, కొద్దిగా ఉప్పూ, జీలకర్రా వేసి కలపాలి. తరవాత నీళ్లు పోస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి. జంతికల గొట్టానికి లోపల నూనె రాసి ఈ పిండిని అందులో ఉంచి కాగే నూనెలో జంతికల్లా ఒత్తుకోవాలి. గోధుమ రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఇవి పదిరోజుల వరకు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.