ధనస్సు(13 – 19 మే 2019)

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఆర్థిక లావాదేవీలు, సంప్రదింపులు ప్రశాంతంగా సాగుతాయి. కీలకమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. దంపతుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. స్త్రీలు ప్రతి చిన్న విషయానికి ఉద్రేకం, ఆందోళన చెందుతారు. మంగళ, శనివారాల్లో దుబారా ఖర్చులు అధికం. ఖర్చులు ఏ మాత్రం అదుపులో ఉండవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి.

వృత్తుల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం వంటి చికాకులు అధికం. చేపట్టిని పనులు అతికష్టంమ్మీద సమయానికి పూర్తి చేయగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. క్రయ విక్రయాలు సామాన్యం. లాయర్ నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన విరమించుకోవడం మంచిది. మిమ్ములను పొగిడిన వారే విమర్శించటానిక వెనుకాడరు. ప్రయాణాలు విసుగు కలిగిస్తాయి.