ధనస్సు(20 – 26 మే 2019)

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం అనుకూల పరిస్థితులున్నాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు విపరీతం, అవసరాలు నెరవేరుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మంగళ, బుధవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం.

కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆప్తుల సలహా పాటించండి. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులను సంతోషపరుస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.