ధనస్సు(6 – 12 మే 2019)

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం. ఈ వారం ఆశాజనకమే. రుణబాధలు తొలగి కుదుటపడతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండాలి.

ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. సహోద్యోగులతో వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. రవాణా, మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు.