వృశ్చికం(6 – 12 మే 2019)

విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యోష్ట కార్యసాధనలో జయం పొందుతారు. గృహం సందడిగా ఉంటుంది. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.

బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతిభాపాఠవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు ఆటంకాలు ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.