వృషభం(13 – 19 మే 2019)

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఆదాయ వ్యయాలు ఫర్వాలేదు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. కుటుంబీకులతో సౌమ్యంగా మెలగండి. ఆది, సోమవారాల్లో ఏ విషయంలోను తీవ్రంగా ఆలోచించడం మంచిది కాదు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాలు, ఉపాథి పథకాల్లో ఆటంకాలను అధికమిస్తారు. వృత్తుల వారు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణమే సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా ఉంటుంది. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. మీ సంతానం ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. పత్రికా సంస్థల్లోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. నిర్మాణ పనుల్లో బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ఒత్తిడి అధికం. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. మార్కెట్ రంగాల వారికి ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది.