వృషభం(6 – 12 మే 2019)

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. ధనం అందక ఇబ్బందులు ఎదుర్కుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు చికాకుపరుస్తుంది.

మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆహ్వానం, పత్రాలు అందుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, పనిభారం. అధికారులకు విశ్రాంతిలోపం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. జూదాలు, బెట్టింగ్‌లో జోలికి పోవద్దు.