కన్య(13 – 19 మే 2019)

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు కుటుంబ, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. రావలసిన ఆదాయం అందడంతో పొదుపు పథకాలపై శ్రద్ధ వహిస్తారు. మీ సంతానానికి దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆది, సోమవారాల్లో మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా సాగించండి. ప్రముఖులతో సంప్రదింపులు, భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా సాగుతాయి. స్త్రీలకు అయిన వారికి వివాహ సమాచారం అందిస్తారు. దైవకార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.

చేపట్టిన పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. కొన్ని అనుకోని సంఘటనలు మీపై ప్రభావం చూపుతాయి. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. చిన్ననాటి వ్యక్తులు, ఆత్మీయులను కలుసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.