కన్య(20 – 26 మే 2019)

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. సాయిం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి.

త్వరలో మీ కృషి ఫలిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా వదిలేయండి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం, రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. వాహనచోదకులకు దూకుడు తగదు.