కన్య(6 – 12 మే 2019)

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు వ్యవహారానుకూలత ఉంది. యత్నాలకు కుటుంబీకులు సహకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. బుధ, గురువారాల్లో ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు.

నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత్త ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారుల ఆదాయం బాగుగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.