లీక్ అయినా ఆర్ ఆర్ ఆర్ చిత్ర సన్నివేశం

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ ఆంచనాలు వున్నాయి. అయితే తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ సోషల్ మీడియాలో లీకైంది. ఎన్టీఆర్ పాత్రపై క్యూరియాసిటీతో ఆన్ లొకేషన్ నుండి ఎవరో ఒకరు ఆ పిక్ ని లీక్ చెయ్యడంతో రాజమౌళి అందరికి వార్నింగ్ ఇచ్చారు. అంత జరిగినా… ఆర్.ఆర్.ఆర్ నుండి లీకుల పర్వం ఆగలేదు. తాజాగా ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే యాక్షన్ సన్నివేశాల తాలూకు విజువల్ ఒకటి బయటికొచ్చింది. ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ యాక్షన్ సీన్ సినిమాలో అతి ముఖ్యమైందని.. ఈ యాక్షన్ సన్నివేశం కోసం చాలా బడ్జెట్ పెట్టారని అంటున్నారు. ఎంతో కష్టపడి వ్యయప్రయాసలతో తెరకెక్కించిన ఈ యాక్షన్ సీన్ లీకవడంతో షాక్ తిన్న మూవీ యూనిట్ వెంటనే ఆ విజువల్స్ ని సోషల్ మీడియా నుండి తొలగించినట్లుగా తెలుస్తుంది.