ఆది పినిశెట్టి కొత్త సినిమా క్లాప్

భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేయడానికి ఇష్టపడే నటుడు ఆది పినిశెట్టి. ప్రస్తుతం ఈయన ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. ఇందులో ఆది ఒక అథ్లెట్, కోచ్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు ‘క్లాప్’ అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు. ఈ పాత్ర కోసం ఆది చాలానే కష్టపడుతున్నారు.

ఎంతలా అంటే గతంలో తన ‘మృగం, ఏకవీర’ సినిమాల్లో పాత్రల కోసం కష్టపడినట్లుగా ఈ సినిమాలో పాత్ర కోసం పనిచేస్తున్నానని అంటున్నారు ఆది. ఇందులో ఆది సరసన ఆకాంక్ష సింగ్ కథానాయకిగా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. బిగ్ ప్రింట్ పిక్చర్స్, పిఎంఎం ఫిలిమ్స్, కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.