అల్లరి నరేష్ తాజా సినిమా నాంది

అల్లరి నరేష్ తన లేటెస్ట్ మూవీ పోస్టర్స్ తో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి కలిగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం సీరియస్ ఇంటెన్స్ లుక్ లో ఉన్న అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసిన నరేష్, నేడు టైటిల్ పోస్టర్ మరింత ఆసక్తిరేపేలా విడుదల చేశారు. ఒంటిపై నూలు పోగులేకుండా తలక్రిందులుగా వ్రేలాడదీసిన నరేష్ పోస్టర్ ఒణికిపోయేలా ఉంది. పోలీస్ లు అతన్ని చిత్ర హింసలుపెడుతున్నట్లు అర్థం అవుతుంది. నాంది అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు రామానాయుడు స్టూడియోలో ఉదయం 9:44 నిమిషాలకు ప్రారంభం కానుంది.బహుశా ఇది క్రిమినల్ స్టోరీ అని అంచనాలు పెరుగుతున్నాయి