తన ఫాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్

బన్నీ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఆయన ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఒక అతిపెద్ద హిట్, అల వైకుంఠపురంలో రూపంలో తన ఖాతాలో చేరింది. బన్నీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో పాటు నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా అల వైకుంఠపురంలో సొంతం చేసుకుంది. మూవీ విడుదలై ఇరవై రోజులు దాటిపోతున్నా కూడా కలెక్షన్స్ జోరు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా బన్నీ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కాగా ఇటీవల ఓ సక్సెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు.

ఓ సన్నివేశం కొరకు బన్నీ అల వైకుంఠపురంలో మూవీలో బీడీ తాగుతాడు. ఆ సన్నివేశంలో బీడీతో బన్నీ మాస్ మేనరిజం ఫ్యాన్స్ కి తెగనచ్చేసింది. దీనితో సామజిక మాధ్యమాలలో బీడీ తాగుతూ వీడియోలు పెడుతున్నారు. ఇది నచ్చని బన్నీ కేవలం సన్నివేశం కోసం బీడీ తాగాల్సివచ్చిందనీ..నిజానికి స్మోక్ చేసే అలవాటు నాకు లేదని అన్నారు. అలాగే మీరు స్మోక్ చేస్తూ నన్ను ఇమిటేట్ చేయడం నాకు నచ్చదు మరియు బాధకలిగిస్తుందని చెప్పారు. ఫ్యాన్స్ ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్న బన్నీ ఔదార్యాన్నీ మెచ్చుకోవాల్సిందే.