కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్

తిరుమల శ్రీవారిని అలా వైకుంఠపురంలో చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నిజపాద సేవలో హీరో అల్లు అర్జున్ సతీసమేతంగా స్వామి సేవలు పాల్గొన్నారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్, చిత్ర నిర్మాత చిన్నబాబు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు పూర్తి చేసారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సన్మానించారు. మరోవైపు ‘అల.. వైకుంఠ‌పురములో’ మూవీ సత్తా చాటుతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 250 కోట్ల గ్రాస్ దాటేసి 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇటు అల్లు అర్జున్‌కి, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఈ విజయం మాంచి బూస్టింగ్ ఇచ్చింది.