వేసవి కాలంలో రానున్నతరువాతి అల్లు అర్జున్ సినిమా

అల్లు అర్జున్ సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో రాబోతున్నాడు. అలాగే ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా 2020 వేసవిలో విడుదల కానుంది. కాగా ఇప్పుడు బన్నీ తన తరువాత చిత్రాన్ని కూడా ఖరారు చేయడానికి కొందరు దర్శకులతో చర్చిస్తునట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఆ సినిమా షూటింగ్ ప్రారంభించాలని బన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడట.కాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజ్ తరువాత బన్నీ తన కొత్త సినిమా గురించి పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక సుకుమార్ తో చేస్తోన్న సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానుంది. అలాగే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది.