సెన్సార్ పనులు పూర్తి చేసున్న అశ్వథామ

యంగ్ హీరో నాగ శౌర్య అశ్వథామ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ చూపించనున్నాడు. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నాగ శౌర్య లుక్ పరంగా కూడా చాలా మేక్ ఓవర్ అయ్యారు. దర్శకుడు రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఈనెల 31న విడుదల అవుతుంది. ఈ చిత్రానికి నాగ శౌర్య స్వయంగా కథను రాసారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యులు అశ్వథామ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ ఇచ్చారు. ఇక అశ్వథామ చిత్ర నిడివి 133నిమిషాలుగా ఉంది. నాగ శౌర్య ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకోగా, సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహ్రిన్ మొదటిసారి నాగ శౌర్య కి జంటగా నటించింది. శ్రీ చరణ్ పాకల ఈ చిత్రానికి సంగీతం అందించారు.