డిసెంబరు 17, 2021న ప్రేక్షకుల ముందుకు రానున్న అవతార్‌ 2

హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్‌ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్‌ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల అవతార్‌ ఫ్యామిలీలోకి రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రెండెన్‌ ఎంటర్‌ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం లైవ్‌ యాక్షన్‌ సీన్స్‌ను న్యూజిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఐతే అవతార్‌ 2 చిత్రం డిసెంబరు 18, 2020న విడుదల అవుతుందని గత కొంత కాలమే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. కాని తాజాగా చిత్రాన్ని డిసెంబరు 17, 2021న విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.