‘అవతార్’ రికార్డులను బద్దలు కొట్టేలా ఉన్న ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’

హాలీవుడ్ మూవీ చిత్రం ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’. వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేషాధారణ పొందింది. ఆయా భాషల్లో ఆయా ప్రాంతాల్లో వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ‘అవతార్’ రికార్డులను బద్దలు కొట్టాలనే పట్టుదలతో పరుగులు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్’ రూ.19,321 కోట్లను వసూలు చేసింది. వసూళ్లపరంగా ఆ తర్వాత స్థానంలో ‘స్టార్‌వార్స్’ వుంది.

ఇప్పటికే రూ.12,590 కోట్లను వసూలు చేసిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’. ఈ వారాంతంలో ‘స్టార్‌వార్స్’ రికార్డును అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.

ఇక భారతీయ బాక్సాఫీస్ దగ్గర తొలిరోజునే రూ.50 కోట్లను రాబట్టిన ఈ సినిమా, ఐదో రోజు నాటికి రూ.200 కోట్లు.. 10వ రోజు నాటికి రూ.300 కోట్లను కొల్లగొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.400 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తున్నట్టుగా చెబుతున్నారు.