గోపీచంద్ కు అక్కగా నటించనున్న భూమిక

టాలీవుడ్ లో ఒకప్పుడు నంబర్ వన్ హీరోయిన్ అందరు స్టార్ హీరోలతో అగ్ర నటిగ నటించింది భూమిక. ఆమె ప్రస్తుతం యంగ్ హీరోలకు అక్క, వదిన లాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఎం సి ఏ చిత్రంలో నానికి వదినగా చేసిన ఈమె బాలయ్య నటించిన రూలర్ మూవీలో మరో కీలక పాత్ర చేసారు. తెలుగులో ఇలాంటి పాత్రలు చేస్తున్న భూమిక మరో హీరోకి అక్కగా నటించనున్నారని సమాచారం. యాక్షన్ హీరో గోపి చంద్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతుంది. కొద్దిరోజుల క్రితం ఈ మూవీ టైటిల్ పోస్టర్ తో పాటు గోపీచంద్ లుక్ కూడా విడుదలయింది .