ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు గారు మరణించారు

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గారు గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. కన్నుమూతపై టాలీవుడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన విశేషమైన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ ప్రతిభాశాలికి నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, మారుతిరావుకి సన్నిహితుడు కోట శ్రీనివాసరావు స్పందిస్తూ ఆయన అస్తమయం తనను షాక్‌కు గురి చేసిందన్నారు.తనకు ఇష్టమైన నటులలో గొల్లపూడి మారుతిరావుగారు ఒకరని టాలీవుడ్‌ హీరో నాని ట్వీట్‌ చేశారు.