చిరు లుక్స్ మీద దృష్టి పెట్టిన డైరెక్టర్ కొరటాల శివ

మెగాస్టార్ చిరు జాబితాలో కొరటాల శివ కూడా ఉన్నారు. ‘సైరా’ పూర్తికాగానే కొరటాల చిత్రం మొదలవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ కాగా చిరు లుక్ మీద దృష్టి పెట్టాడు కొరటాల.

అందుకోసం తాజాగా చిరుకు లుక్ టెస్ట్ నిర్వహించారు. తన ప్రతి సినిమాలోనూ హీరోని చాలా ఉన్నతంగా, స్టైలిష్ గా చూపించే కొరటాల చిరును ఎలా చూపిస్తారో చూడాలి. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా రైతు సమస్యలపై నడిచేదిగా ఉంటుందని టాక్. ఇకపోతే ఇందులో చిరుకు జోడీగా నయనతార, తమన్నాలు నటించనున్నారు.