సూర్యకాంతం టీజర్‌

మెగా డాటర్‌ నిహారికకు సరైన టైమ్‌ రావడం లేదు. బుల్లితెర మీద రాణించిన నిహారిక.. వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఒక మనసు, హ్యాపి వెడ్డింగ్‌ చిత్రాలతో అభిమానులను పలకరించినా.. ఆశించినంత విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. ఈ సారి ‘సూర్యకాంతం’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు.

ఫైట్‌ మాస్టర్‌ విజయ్ తనయుడు రాహుల్‌విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న సూర్యకాంతం చిత్రంలో నిహారికి విభిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నేడు(జనవరి 25) ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీ టీజర్‌ను వరుణ్‌ తేజ్‌ ఈ రోజు సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నారు. సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రణీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని మార్చిలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.