మే 3న జరగాల్సిన జాతీయ అవార్డు ప్రధానోత్సవం నిరవధిక వాయిదా

ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో పాటు, విడుదల కావాల్సిన మూవీస్‌ వాయిదా పడ్డాయి। కరోనా వైరస్ విజృంభిస్తున్న‌ క్రమంలో సినీ పరిశ్రమపై తీవ్ర‌ప్ర‌భావాన్ని చూపిస్తుంది। క‌రోనా ఎఫెక్ట్‌ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కూడా వాయిదా ప‌డింది. క‌రోనా దృష్ట్యా అవార్డుల ప్ర‌ధానోత్స‌వాన్ని వాయిదా వేయ‌క త‌ప్ప‌డం లేద‌ని గ‌త‌ జ్యూరీ ప్ర‌క‌టించింది.

మే 3న జరగాల్సిన జాతీయ అవార్డు ప్రధానోత్సవం నిరవధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు వివ‌రించారు. సాధారణంగా ఈ పాటికి జ్యూరీ ఏర్పాటై ఏప్రిల్ చివరిలోగా విన్నర్‌ల లిస్ట్‌ను తయారయ్యేది. అలాగే మే లో ప్రధానోత్సవం జరిగేది. కానీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఇంకా జ్యూరీనే ఏర్పాటు కాలేదు. అందుకే అవార్డుల ప్రధానోత్సవం వాయిదా పడింది.